Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ లో వివిధ విభాగాల్లో మంచి పోరాట పటిమ కనపరచి పతకాలు కోల్పోయిన 24 మంది క్రీడాకారులకు టాటా మోటార్స్ అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లను బహుమతిగా ఇచ్చింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ మైదానంలో పోరాడినా తృటిలో పతకం తప్పిపోవడం బాధాకరమే అయినా.. వారి పోరాట పటిమ, చివరి క్షణం వరకు పోరాడిన దృఢ సంకల్పం ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి కలిగించాయని, కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న వారికి తమవంతుగా కార్లతో సత్కరించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.