హైదరాబాద్ : తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురైను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. చెనైకి చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై తన ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని ఇది గొప్ప ఆలోచన అంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అన్నాదురై గత 10 ఏళ్ల నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రయాణికుల అవసరాలు తెలుసుకుని తన ఆటోలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నాదురై ఇటీవల తన ఆటోలో ఐపాడ్, ల్యాప్‌ల్యాప్, ఫ్రిజ్, స్నాక్న్, కూల్‌డ్రింక్స్, ఉచిత వైఫై, మ్యాగజైన్‌లను వంటి పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడు. దీంతో అన్నాదురై ఆటోలోని సౌకర్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వచ్చింది. తనకు డబ్బు కంటే కస్టమర్ల సంతోషమే ముఖ్యమని.. అందుకని కస్టమర్ల కోసం పలు లగ్జరీ గాడ్జెట్స్‌ను అందుబాటులో ఉంచానని అన్నాదురై స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.