పూణె : మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ నాయత్వంలోని వెలాసిటీ జట్టు, హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు ఢీకొనబోతున్నాయి. పుణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సూపర్ నోవాస్ (ప్లేయింగ్ XI): ప్రియా పునియా, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్, తానియా భాటియా(w), హర్మన్‌ప్రీత్ కౌర్(c), సునే లూయస్, పూజా వస్త్రాకర్, అలనా కింగ్, సోఫీ ఎక్లెస్టోన్, మాన్సీ జోషి, రాశి కనోజియా