Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: భూత వైద్యం పేరుతో యువతులను లొంగదీసుకుని దొంగ బాబా ఏడు పెండ్లిళ్లు చేసుకున్నాడు. 8వ పెండ్లికి సిద్దమైన వీఐపీ బాబాను పోలీసులు పట్టుకున్నారు. దయ్యం పట్టిందని యువతులను లొంగతీసుకోవడం అతని స్పెషాలిటి. దొంగ బాబా ఎనిమిదవ పెండ్లి కోసం సుమారు 200 మంది ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న బంధువులు... చివిరి నిమిషంలో పెండ్లి క్యాన్సిల్ అయింది. దొంగ బాబాకు పక్క రాష్ట్రంలో ఉన్న బడా రాజకీయనాయకుల అండ ఉంది. కాగా విషయం తెలుసుకున్న లంగర్ హౌజ్ పోలీసులు వీఐపీ బాబాను అరెస్టు చేశారు.
నిన్న రాత్రి 11 గంటలకు తబసున్ ఫాతిమా అనే అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. నెల్లూరులో ఉన్న రెహ్మతాబాద్ దర్గాకు చెందిన హఫీజ్ పాషా అనే బాబా తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. టోలిచౌక్‌కు చెందిన ఫాతిమా మూడేళ్లుగా నెల్లూరు దర్గాలో చికిత్స తీసుకుంటోంది.. బాబా తనను పెండ్లి చేసుకుంటాను అని చెప్పడంతో.. ఆమె హైదరాబాద్ టోలిచౌకి ఫంక్షన్ హాల్లో పెండ్లి ఏర్పాట్లు చేసుకుందన్నారు. అయితే బాబా పెండ్లికి రాకపోవడంతో ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. కాగా బాబాకు గతంలో 7 పెండ్లిళ్లు అయ్యాయని, అమ్మాయి తరఫు బంధువులు చెప్పారన్నారు. నెల్లూరులో బాబా చాలా ఫెమస్ అని చెబుతున్నారని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాస్ చెప్పారు.