Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చికిత్స అందుతుందని.. త్వరగా రోగాలు కూడా నయమవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు కోటి మందికిపైగా ప్రజలు చికిత్స పొందారని తెలిపారు. ఇందులో ఉచితంగా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వివరించారు. మార్చి ఆఖరునాటికి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. వీటి ఏర్పాటు వల్ల ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిపై ఓపీ భారం తగ్గిందన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషియన్ కిట్స్ అందిస్తామని చెప్పారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే 1540 ఆశా పోస్టుల భర్తీ చేపడతామన్నారు. క్రమంగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.