Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం నవ వధువు వెడ్డింగ్ డ్రెస్‌పై తెల్ల కోటుతో పరీక్షా కేంద్రానికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలో ఈ ఘటన జరగ్గా పెండ్లి జరిగే రోజున పరీక్ష రాసేందుకు వెళ్లితీరాలన్న వధువు పట్టుదలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ అయిన ఈ వీడియో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపైనా వైరల్‌గా మారింది. క్లిప్‌లో పెండ్లికూతురుని శ్రీ లక్ష్మీ అనిల్‌గా గుర్తించారు. బెథానీ నవజీవన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ స్టూడెంట్ కాగా ఆమె పెండ్లి జరిగే రోజునే పరీక్ష తేదీ కావడంతో పెండ్లి కూతురిగా ముస్తాబై అదే డ్రెస్‌లో భారీ జ్యూవెలరీతో పరీక్షా కేంద్రానికి హాజరైంది.
వెడ్డింగ్ శారీపై ల్యాబ్ కోట్తో వచ్చిన నవ వధువు ఎగ్జామ్ రాసేందుకు ఆమె క్లాస్మేట్స్ సహకరించారు. మెడికోస్ లైఫ్..ఫిజియోధెరఫీ. ఒకేరోజున పరీక్ష..పెండ్లి అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పెద్దసంఖ్యలో నెటిజన్లను ఆకట్టుకుంది. పెండ్లితో పాటు కెరీర్‌కూ సమంగా ప్రాధాన్యత ఇచ్చిందని నవ వధువును పలువురు ప్రశంసించారు. పెండ్లితో తమ కెరీర్ ముగిసిందని అనుకునే వారందరికీ నవ వధువు కనువిప్పు కలిగించారని కొందరు కామెంట్ చేశారు.