Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఫుడ్ డెలివరీ టెక్ కంపెనీ జొమాటో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నది. దాంతో దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునేందుకు చిన్న నగరాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ‘గత కొన్ని త్రైమాసికాల్లో ఈ నగరాల్లో పనితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొన్నది. ఇదే సమయంలో కంపెనీ తన లాభాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి వెల్లడిస్తూ.. ఆర్డర్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభిస్తున్నట్లు జొమాటో తెలిపింది. ఈ పథకంలో 9 లక్షల మంది సభ్యులగా చేరారని కంపెనీ పేర్కొన్నది.
భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్‌లలో జొమాటో ఒకటి. కంపెనీ ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం దేశంలోని 1,000 కంటే ఎక్కువ నగరాల్లో నడుస్తున్నది. 2023 మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టం 5 రెట్లు పెరిగి రూ.343 కోట్లకు చేరుకున్నది. అయితే, ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.1,112 కోట్ల నుంచి రూ. 1,948 కోట్లకు 75 శాతం వృద్ధి చెందింది. ఖర్చులను తగ్గించుకోవాలన్ని ప్రణాళికలో భాగంగా 225 చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపివేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు.