Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
బీపీ మండల్ దేశంలో అన్ని వర్గాలపై వత్తిడి తెచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు వీసీకే పార్టీ అధ్యక్షులు తిరుమావళన్. మండల్ కమీషన్ సిఫారసులు అమలు పరచడం వల్ల వీపీ సింగ్ అధికారం కోల్పోయారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ ల ఐఖ్యత దేశానికి అవసరం. దేశంలో 2024లో బ్రాహ్మణ భావజాలం ఉన్న పార్టీ లు అధికారంలోకి వస్తే ఇక రిజర్వేషన్లు ఉండవనొ హెచ్చరించారు. దేశంలో అన్ని జిల్లాలో మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి. హైదరాబాదులో కూడా మండల్ విగ్రహం ఏర్పటు చేయాలని కేసీఆర్ ను కోరానన్నారు.
మన హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, బీసీల కు హక్కులు కల్పించలేక పోయనన్న బాధతో బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. బీసీల ఆత్మగౌరవం కోసం దేశ వ్యాప్తంగా బీసీలు పోరాటం చేయాలి. బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు బీసీల మలివిడత ఉద్యమంగా భావించాలన్నారు.