Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా పదోన్నతి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ లతో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డీవీ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నత పొందడానికి ముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పూర్తి స్థాయికి..34కు చేరింది.