Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తమిళనాడు సీంఎ లాంటివారే మెచ్చుకున్నారని చెప్పారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఒకవేళ పర్మిషన్ రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని తెలిపారు. టీఎస్ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. గృహ నిర్మాణ శాఖ రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌సాగర్ కాలుష్యం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. ధరణి వచ్చాక చిన్న భూమిని కూడా మ్యాచ్ చేశామని తెలిపారు.