Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టల్ పైఅంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం
- తీవ్రంగా గాయపడిన విద్యార్థిని
- ఆస్పత్రి తరలించిన పోలీసులుప
నవతెలంగాణ-గంగాధర
గంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని హాస్టల్ పైఅంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై రాజు, అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలం కమాన్ పూర్ కు చెందిన హాసిని అనే విద్యార్థిని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యాభ్యాసం చేస్తుంది. గురుకుల పాఠశాలలో హాస్టల్ లో ఉండడం ఇష్టం లేక విద్యార్థిని పైఅంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెకలిపారు.
ఈ గురుకుల పాఠశాల సీట్ రావడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా లేక విద్యార్థిని హాస్టల్ లో చేర్చినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఆదివారం సెలవు కావడంతో తమ పిల్లలను చూడడానికి హాస్టల్ కు వస్తూ వెళ్తున్నారు. అయితే హాసిని తల్లిదండ్రులు చూడడానికి రాకపోగా, తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేక అనారోగ్యంతో ఉండడం వల్ల హాస్టల్ కు రాలేకపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని తనను ఎవ్వరు పట్టించుకోవడం లేదనే దిగులుతో హాస్టల్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
పట్టింపు కరువు..భద్రత శూన్యం..
విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల్సిన హాస్టల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పట్టింపులోని ధోరణితో వ్యవహరించడం వల్లే విద్యార్థిని పైఅంతస్తు నుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులతో స్థానికంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కరీంనగర్ లో నివాసం ఉంటూ ఉదయం వస్తుా సాయంత్రం వెళ్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా, పట్టింపులేని లేని దోరణితో వ్యవహరిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు వివరించారు.