Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, మాకు ధైర్యం, నిజాయితీ ఉందన్నారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టుకోవాలని చెప్పాం. రెడ్ ఇండియన్స్‌ను చిత్రహింసలకు గురి చేసి, బ్లాక్ అంటూ అవమానపరిచినటువంటి అమెరికన్ తెల్లజాతీయులు బరాక్ ఒబామాను అమెరికా అధ్యక్షుడిని చేయడం వల్ల వాళ్ల పాపాన్ని కడిగేసుకున్నరు అని చెప్పా. అట్లనే ఏదైనా దళిత సమాజాన్ని వివక్షకు గురి చేసినమో వాళ్ల కోసం పోరాటం చేసిన, సిద్ధాంతాలను తీసుకువచ్చిన మహనీయుడి పేరును భారత పార్లమెంట్‌కు పెట్టాలని చెబితే పట్టించుకోలేదు’ అన్నారు.