Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష కూడా పూర్తయింది. త్వరలోనే ఈవెంట్స్ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగారు. తమకు డబ్బు ఇస్తే ఉద్యోగం పక్కాగా వస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా చేస్తున్నామని హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఉద్యోగాల విషయంలో అభ్యర్థులు ఎవరు అపోహలకు గురికావద్దని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దని, మాయమాటల వలలో పడి మోసపోవద్దని మంత్రి హెచ్చరించారు.