Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాదాద్రి తరహాలో కొంటగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాని కోసం రూ.100 కోట్ల నిధులు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ వాస్తు శిల్పి ఆనంద్ సాయి కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు.
ఆగమశాస్త్రం ప్రకారం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ అమలు చేయడంతో పాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు, అర్చకులతో చర్చించినట్లు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి తెలిపారు. ఈ నెల 14న సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానుండగా ఆనంద్‌సాయి ముందుగానే వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయానికి రెండో ప్రాకార మండపం, పుష్కరిణి, విద్యుత్తు, గదులు, నీటి వసతి, మెట్ల దారి వెంట భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.