Truck driver's revenge after men in car allegedly Insulted him - Meerut, UP.pic.twitter.com/u7Ls4Y6FAH
— Mihir Jha (@MihirkJha) February 12, 2023
Authorization
Truck driver's revenge after men in car allegedly Insulted him - Meerut, UP.pic.twitter.com/u7Ls4Y6FAH
— Mihir Jha (@MihirkJha) February 12, 2023
నవతెలంగాణ - లక్నో
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది. ఈక్రమంలో లారీ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. అనంతరం లారీదిగి పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు పట్టించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారుల్లో ఐదుగురు ఉన్నారని చెప్పారు. ట్రక్కు ఢిల్లీ నుంచి వస్తున్నదని పేర్కొన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతున్నది.