Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రైతుల ఆందోళనల క్రమంలో ప్రస్తుతం ఈ ప్లాన్ ను పక్కన పెట్టినట్లు తెలిపింది.
ఈ తరుణంలో హైకోర్టు స్పందిస్తూ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అవసరమైతే ముందుగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టుకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ లో ఇంప్లీడ్ పర్సన్ గా డివిజనల్ బెంచ్ ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాదనలు వినిపించారు.