Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్నుదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించి, ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు వారి సౌకర్యార్ధం ఇప్పటికే 36 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ, తదితర సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
దీంతో సేవలను పారదర్శకంగా, సులభంగా పొందగలుగుతున్నారని, దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని, అందులో భాగంగానే జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించుకున్నామన్నారు. ఈతరుణంలో ఇకపై భక్తులు ఆన్లైన్ మోడ్ ద్వారా దర్శన టిక్కెట్లు, పూజలు, అర్చనలు, ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.