Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న బిల్లు కలెక్టర్ రషీద్‌పై 33వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ అహ్మద్, అతని అనుచరుల దాడి చెయ్యటాన్ని ఖండిస్తూ మున్సిపల్ ఉద్యోగులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఉద్యోగి రషీద్‌పై నలుగురు వ్యక్తులతో కలిసి కౌన్సిలర్ అహ్మద్ దాడి చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో రషీద్ కంటికి గాయమైందన్నారు. గతంలో ఎన్నడూ.. ఉద్యోగులపై దాడులు జరిగిన దాఖలాలు లేవన్నారు. రషీద్‌పై జరిగిన దాడిని ఉద్యోగస్తుల అందరి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న తమపై అధికార పార్టీ కౌన్సిలర్ అతని అనుచరులు దాడులకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.