Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మైసూరు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త అదిల్ దుర్రానీపై రేప్ కేసు నమోదు అయ్యింది. మైసూరులో అతనిపై ఆ కేసు బుక్కైంది. ఇరాన్‌కు చెందిన విద్యార్ధిని ఈ ఆరోపణ చేసింది. చదువు కోసం ఇరాన్ నుంచి వచ్చిన యువతిని రాఖీ భర్త దుర్రానీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేప్, చీటింగ్, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపు ఆరోపణల కింద కేసు బుక్ చేశారు. మైసూరులోని వీవీ పూరం పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
ఫార్మసీ చదవేందుకు ఇరాన్ నుంచి ఓ అమ్మాయి మైసూరుకు వచ్చింది. అయిదేళ్ల నుంచి ఆమె ఇక్కడే విద్యను కొనసాగిస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతిని రేప్ చేసినట్లు దుర్రానీపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతో దుర్రానీపై శరీరకంగా దగ్గరైనట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే అయిదేళ్ల నుంచి పెళ్లి చేసుకునేందుకు అనిల్ నిరాకరించినట్లు ఆమె చెప్పింది. అదిల్ దుర్రానీపై భార్య రాఖీ సావంత్ కూడా కేసు బుక్ చేయడంతో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన ఫండ్స్‌ను దుర్వినియోగం చేసినట్లు అదిల్పై రాఖీ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది.