Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకర్గ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనకు వైసీపీలోకి జగన్ స్వాగతం పలికారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వంతో ఆయన వైసీపీలో చేరారు. మరోవైపు వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీట్ ను వెంకటరమణకు జగన్ కేటాయించారు. అంతేకాదు, ఆయనకు నలుగురు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది.