Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్ ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే 2022 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మోర్గాన్.. ఇతర లీగ్‌లలో ఆడుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. మోర్గాన్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, ముందుగా 2006 నుంచి 2009 వరకు మోర్గాన్ ఐర్లాండ్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2009 నుంచి ఇంగ్లండ్ జట్టుకు మారాడు. 2006లో స్కాట్లాండ్తో తొలి వన్డే, 2022 జూన్‌లో నెదర్లాండ్స్‌తో చివరి వన్డే ఆడాడు. అదేవిధంగా 2009లో నెదర్లాండ్స్‌తో తొలి టీ20, 2022 జనవరిలో వెస్టిండీస్‌తో చివరి టీ20లో పార్టిసిపేట్ చేశాడు. అయితే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు, పాకిస్థాన్‌తో చివరి టెస్టు ఆడిన మోర్గాన్ టెస్టు కెరీర్ కేవలం రెండేళ్లు మాత్రమే. తన కెరీర్లో 16 టెస్టులు ఆడిన మోర్గాన్ 30.43 సగటుతో 700 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 130 అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఇక వన్డేల విషయానికి వస్తే మొత్తం 248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు రాబట్టాడు. అందులో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 148. మొత్తం 115 టీ20లు ఆడిన మోర్గాన్ 28.58 సగటుతో 2,458 పరుగులు చేశాడు. 91 టాప్ స్కోర్.