Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు (ఫిబ్రవరి 14) కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే కొండగట్టులో ఆయన పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ తన పర్యటనను ఎల్లుండికి మార్చుకున్నారు. రేపు మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. అయితే, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంగళవారం రోజున ఆలయ పర్యటన ఇబ్బందికరంగా ఉంటుందని సీఎంవో భావించింది. సీఎం రాకతో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఈ పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కారు ఇటీవలి బడ్జెట్ లో కొండగట్టు క్షేత్రం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించడం తెలిసిందే. యాదాద్రి తరహాలోనే ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీర్చిదిద్దనున్నారు.