Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
పుణెలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ అందాయి. ఈ తరుణంలో అప్రమత్తమైన సిబ్బంది పుణె పోలీసులకు సమాచారం అందించారు. గూగుల్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
అనంతరం గూగుల్ ఆఫీసులో ఎలాంటి బాంబు లేదని పోలీసులు గుర్తించారు. హోక్స్ కాల్ అని పోలీసులు తేల్చారు. అయితే బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరానికి చెందిన పణయం శివానంద్ బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేసి, ముంబైకి తరలించారు.