Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రజల్ని ఆవు ఢీ కొంటే ఏమవుతుందో తెలుసా అంటూ ఆమె కేంద్రాన్ని నిలదీశారు. ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా పాటించాలని భారత జంతు సంక్షేమ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసి ఆపై దాన్ని ఉపసంహరించుకున్న నేపధ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కౌ హగ్ నోటిఫికేషన్‌పై మండిపడ్డ దీదీ ఆవు మనిషిని ఢీ కొడితే ఏమవుతుందని విస్మయం వ్యక్తం చేశారు. ఆవు మన మీదికి దూసుకొచ్చి ఢీ కొంటే పరిహారం వారు (బీజేపీ) చెల్లిస్తారా అని దీదీ ప్రశ్నించారు. ఇక అంతకుముందు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో భారత సంస్కృతి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు ఆవు వెన్నెముకని మనందరికీ తెలుసు..ఆవును మనం కామధేనువుగా, గోమాతగా భావించి పూజిస్తాం..ఆవును కౌగిలించుకుంటే మనం ఎమోషనల్‌గా సుసంపన్నమవుతాం..అది మన వ్యక్తిగత, సామూహిక సంతోషాన్ని ఇనుమడింపచేస్తుందని పేర్కొంది. గోవు ప్రేమికులంతా వాలెంటైన్స్ డేను కౌ హగ్ డేగా జరుపుకోవాలని లేఖ చివరిలో అభ్యర్ధించారు. ఈ నోటిఫికేషన్‌పై విపక్షాలు విరుచుకుపడటంతో ఆపై ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే ఈ నోటిఫికేషన్‌కు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు మద్దతు పలికారు. ప్రతి ఒక్కరూ గోవులను గౌరవించాలని, ఇది మంచి కార్యక్రమమని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.