Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కేసు విచారణను వచ్చే 17వ తేదీ శుక్రవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో ముందస్తు తేదీ కూడా వాయిదా పడింది. దీనికి ముందు, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పి్స్తూ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై సీజేఐ డివై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 'అమెరికా న్యాయమూర్తుల ప్రతినిధి బృందంతో మేము సమావేశం కావాల్సి ఉంది. ఆ కారణంగా కేసు విచారణను శుక్రవారం చేపడతాం' అని సీజేఐ ప్రకటించారు. కాగా, విచారణ జరిగేంత వరకూ ఎంసీడీ మేయర్ ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఎల్జీ కార్యాలయం స్పందించింది. ఫిబ్రవరి 16వ తేదీన అనుకున్న మేయర్ ఎన్నికలను 17వ తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.