Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ : యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వెకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి ఉ యోగా ( బీఎన్వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అర్హత ఉన్న అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని యూనివర్సిటీ తెలిపింది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.