Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని - కీర్తి సురేశ్ జంటగా 'దసరా' సినిమా రూపొందింది. ఎస్.ఎల్.వి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సింగరేణి బొగ్గుగనులకి సమీపంలో గల ఒక గ్రామం .. ఆ గ్రామం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మాస్ లుక్ తో ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. కొంతసేపటి క్రితం హైదరాబాదులోని Aవీదీ సినిమాస్ - స్క్రీన్ 1లో ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. సాంకేతిక సమస్య వలన ఈ వేదిక ద్వారా సెకండ్ సింగిల్ ఆడియోను మాత్రమే రిలీజ్ చేశారు. 'ఓరి వారి నీదు గాదుర పోరీ' అంటూ ఈ పాట మొదలవుతోంది. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. నాని మాట్లాడుతూ .. 'ఇది నా కెరియర్లోనే బెస్ట్ సాంగ్ .. వినేకొద్దీ ఎక్కేస్తుంది. ఈ సినిమాలో నేను సిల్క్ స్మిత ఫ్యాన్ ని అని రాస్తున్నారు .. అందులో ఎంతమాత్రం నిజం లేదు. సిల్క్ స్మిత పోస్టర్ ను ఎందుకు చూపిస్తున్నామనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే' అని అన్నాడు. సముద్రఖని .. సాయికుమార్ .. దీక్షిత్ శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.