Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: భాగ్యనగరంలో 46 రోజుల పాటు సాగిన నుమాయిష్ ప్రదర్శన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహా ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా 46 రోజులపాటు అత్యుత్తమ సేవలను అందించిన పోలీసు శాఖ సిబ్బంది, పలు స్టాల్స్ యజమానులకు మంత్రి మహమూద్ అలీ అవార్డులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర మద్దతు, ప్రోత్సాహంతో సొసైటీ సభ్యులు ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించారని మంత్రి ప్రశంసించారు. నుమాయిష్ ద్వారా 46 రోజుల్లో సమకూరిన ఆదాయాన్ని 19 విద్యా సంస్థలు, ఛారిటబుల్ డిస్పెన్సరీల నిర్వహణకు ఉపయోగించనున్నట్లు మహమూద్ అలీ తెలిపారు.