Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దోమలగూడ, లేక్ పోలీసు స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మారేడుపల్లి, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ, బహదూర్పురా, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, టోలిచౌకి, లంగర్ హౌజ్లలో కొత్త ట్రాఫిక్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త పోలీసు స్టేషన్లకు ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని నియమించనున్నారు.