Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 'దసరా'. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్.. హార్ట్ బ్రేక్ సాంగ్‌ను నేడు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే.. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర యూనిట్ ఈ సాంగ్ ను విడుదల చేసింది. 'ఓరి వారి నీది గాదుర పోరి' అంటూ ఈ పాట మొదలవుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. కథానాయకుడు తన విఫల ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ పడే మనోవేదనను ఈ పాట ఆవిష్కరిస్తుండగా.. తెలంగాణ యాసలో చాలా సరళమైన పదాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ పాట సాగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.