Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీల కోసం మరో 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలను నిర్వహించాలని నిర్ణయించి, అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత , కోర్టు ఆదేశాల మేరకు.. కొత్త జిల్లాలకు బదిలీ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ప్రక్రియ ఈ నెల 14న ముగుస్తుంది. గతంలో వచ్చిన 59 వేల దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 67 వేల దరఖాస్తులు వచ్చాయి.