Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా, సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల- 15 నుంచి ‘కేసీఆర్ కప్- 2023’ వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె తన నివాసంలో వాలీబాల్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈనెల 15, 16 తేదిల్లో హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీ విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 1 లక్ష, ద్వితీయ బహుమతిగా రూ. 75 వేలు, తృతీయ బహుమతిగా రూ. 50 వేల నగదును దాంతో పాటు ట్రోఫీ, మెడల్స్‌ను, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నట్లు కవిత వెల్లడించారు.