Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి షాకిచ్చాడు. ఔరంగాబాద్ పట్టణంలో నితీశ్ చేపట్టిన సమాధాన్ యాత్రకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఈ యాత్రలో భాగంగా బరూన్ బ్లాక్‌లో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు నితీశ్ వస్తున్నారు. అంతలోనే జనాల మధ్యలో నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి.. సీఎం నితీశ్‌పైకి విరిగిన ప్లాస్టిక్ కుర్చీని విసిరేశాడు. దీంతో సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ చైర్ నితీశ్‌కు కొంచెం దూరంలో పడింది. ఆయనకు ఈ దాడి నుంచి బయటపడటంతో.. భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక నితీశ్‌కు చేతులు అడ్డం పెట్టి.. భద్రతా సిబ్బంది ముందుకు సాగారు. కుర్చీ విసిరిన వ్యక్తి కోసం ఔరంగాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.