Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గురుగ్రామ్
గురుగ్రామ్ నగరంలో దారుణ ఘటన జరిగింది. గురుగ్రామ్‌లోని సహారా మాల్లోని బేస్మెంట్లో పార్క్ చేసిన తన కారులో 27 ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి, లైంగికదాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మహిళను ఉద్యోగ ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, నీళ్లలో మత్తుమందు కలిపిన నిందితుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతుకుతూ తుషార్ శర్మ అనే వ్యక్తిని సంప్రదించగా, అతను తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత శనివారం సహారా మాల్లో ఇంటర్వ్యూ సాకుతో శర్మ బాధిత మహిళకు ఫోన్ చేశాడు. ఆమె తన సర్టిఫికెట్లతో మధ్యాహ్నం ఒంటిగంటకు మాల్‌కు చేరి, శర్మను కలుసుకుంది. ఆపై శర్మ మహిళను మాల్లోని బేస్మెంట్కు తీసుకువెళ్లి ఆమెకు నీటిని అందించాడు. ఆ నీరు తాగిన మహిళ స్పృహ కోల్పోయింది. శర్మ తనను కారులోకి తోసి లైంగికదాడి చేశాడని బాధిత మహిళ చెప్పారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆమెను మాల్ పార్కింగ్‌లో వదిలేసి పారిపోయాడు.బాధిత మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శర్మపై ఐపీసీ సెక్షన్ 328, 376,506 లపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని గురుగ్రామ్ పోలీసులు చెప్పారు.ఆధారాల కోసం మాల్ లో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు.