Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
రైల్వే లైన్లో మరమ్మతుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసిన రైల్వేశాఖ.. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ వివరాలిలా వున్నాయి... - ఈ నెల 17వ తేదీ ఉదయం 11.10 గంటలకు కొచ్చువేలి నుంచి ఇండోర్‌కి బయలుదేరాల్సిన వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20931), ఈ నెల 21వ తేదీ రాత్రి 9.40 గంటలకు ఇండోర్ నుంచి కొచ్చువేలి బయలుదేరాల్సిన వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20932)లను రద్దు చేసినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 14, 21 తేదీల్లో రామేశ్వరం నుంచి అజ్మీర్‌కు బయలుదేరాల్సిన హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (20974)ను ఉజ్జయిని, ఫతేబాద్, చంద్రవాటిగంజ్, రట్లం మీదుగా దారి మళ్లించారు. కాగా ఈ నెల 21వ తేదీన బయలుదేరాల్సిన ఈ రైలు రామేశ్వరం - విల్లుపురం మధ్య నడవదని గతంలో దక్షిణరైల్వే ప్రకటించింది. - ఈ నెల 18వ తేదీ రాత్రి 8.20 గంటలకు అజ్మీర్ నుంచి రామేశ్వరానికి బయలుదేరాల్సిన హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (20973) రట్నం, ఫతేబాద్, చంద్రవాటిగంజ్, ఉజ్జయిని మీదుగా దారి మళ్లించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ను విల్లుపురం-రామేశ్వరం మధ్య రద్దు చేస్తున్నట్లు గతంలో దక్షిణరైల్వే ప్రకటించింది. - ఈ నెల 16, 17, 19 తేదీల్లో ఉదయం 6.35 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి కొచ్చువేలికి బయలుదేరాల్సిన ‘రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్’ను కాన్పూర్, ఎతవా, భిండ్, గ్వాలియర్, విరంగన లక్ష్మిబాయ్ ఝాన్సీ మీదుగా మళ్లించనున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 10.50 గంటలకు బరౌనీ నుంచి ఎర్నాకులం బయలుదేరే ‘రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్’ను కాన్పూర్, ఎతవా, భిండ్, గ్వాలియర్, విరంగన లక్ష్మిబాయ్ ఝాన్సీ మీదుగా దారి మళ్లించారు.