Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం
రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ‘‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’’పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు రేవంత్ పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు. రేవంత్‌తో కలిసి రెండు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా జరుగుతున్న ‘‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’’ యాత్రలో రెండు రోజుల పాటు పాల్గొననున్నట్టు హనుమంతరావు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం భద్రాచలంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని, రేపు పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొననున్నట్లు వీహెచ్ తెలిపారు.