Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాసబ్‌ట్యాంక్‌లో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి వెలసిన నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేస్తున్నారు. బెస్తివాడ బస్తీ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో అధికారులను బెస్తివాడ వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇళ్ల కూల్చివేతతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 150కిపైగా నివాసాలు ఉన్నాయి. వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామని తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు బలగాలతో మంగళవారం తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.