Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాషింగ్టన్
అగ్రరాజం అమెరికాలోని ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు యూనివర్సిటీలోకి చొరబడ్డాడు.
క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. మరో పది మంది వరకు గాయపడినట్లు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.