Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నెల్లూరు
బంగారం ధరలు ఇటీవలి కాలంలో ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులో దారుణం జరిగింది. 20 కిలోల బంగారంతో ఓ వ్యాపారి పరారయ్యాడు. దీంతో బాధితులు నెల్లూరులోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు చిన్నబజారుకి చెందిన కిరణ్ అనే వ్యాపారి.. బంగారం వ్యాపారులను నమ్మించి మోసం చేశాడు. 20 కిలోలకు పైగా బంగారు తీసుకుని.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సంతపేట, నవాబుపేట పీఎస్‌లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.