Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఎన్నో ఆశలతో ఒక్కటైన ఆ జంట పెళ్లయిన కొద్ది రోజులకే ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వారి రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు.
ఒడిస్సాలోని అత్తగారింటికి భార్యతో కలిసి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహానాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో నవ దంపతులు సింహాచలం, ప్రవళికలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం విజయవాడ గూడవల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు, ద్విచక్రవాహనం ఢీ కొనగా ఏలూరు జిల్లాకు చెందిన షేక్ రిజ్వాన్, షేక్ రఫీ దుర్మరణం చెందారు.