Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం. కొన్ని నివేదికలు శాఖ కార్యాలయాన్ని కూడా సీల్ చేయవచ్చని సూచిస్తున్నాయి. అయితే 60 నుంచి 70 మంది సభ్యుల బృందం బీబీసీ కార్యాలయానికి చేరుకుని సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఉద్యోగులందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అంతేకాకుండా కార్యాలయంలోకి ఇతరుల ప్రవేశం, నిష్క్రమణ కూడా నిషేధించబడింది. ఈ క్రమంలో బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.