Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత్‌లో వన్‌ప్లస్ 11 5జీ సేల్ మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. న్యూ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగిఉంది. వన్‌ప్లస్ 11 5జీ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు వన్‌ఫ్లస్ అఫిషియల్ ఆఫ్‌లైన్ ఛానెల్స్‌తో పాటు అమెజాన్‌పై కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 5జీ బేస్ మోడల్ 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తోంది. బేస్ మోడల్ ధర రూ. 56,999 కాగా టాప్ వేరియంట్ రూ. 61,999కి లభిస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రొతో పోలిస్తే వన్‌ప్లస్ 11 5జీ అందుబాటులో ధరలో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇక వన్‌ప్లస్ 11 5జీ కస్టమర్ల కోసం వన్‌ప్లస్ కొన్ని బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు రూ. 1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్ 11 5జీ 6.7 ఇంచ్ 2కే సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్ ప్యానెల్‌తో క్వాల్‌కాం లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగిఉంది.
వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌లో భాగంగా 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమరాతో పాటు 48 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్709 సెన్సర్ ఆకట్టుకుంటాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. న్యూ జనరేషన్ అండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13పై ఈ ఫోన్ రన్ అవుతుంది. 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.