Oh Shit pic.twitter.com/MG195HihOH
— Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023
Authorization
Oh Shit pic.twitter.com/MG195HihOH
— Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్‌లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్‌లో 2016లో ఈ ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. పార్క్‌లో ఓ మహిళ కుటుంబంతో కలిసి సఫారీకి వెళ్లింది. సఫారీ మధ్యలో కారు దిగిన యువతి.. డ్రైవర్ సీటు వద్దకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పెద్ద పులి.. యువతిని ఒక్కసారిగా నోటితో పట్టుకుని లాక్కెళ్లింది. ఆమెను రక్షించుకునేందుకు ఆమె తల్లి, భర్త పులి వెంట పరుగులు తీశారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలతో బయటపడగా.. ఆమె తల్లి మృతి చెందినట్లు తెలుస్తోంది.