Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు 5,814 మంది అని అధికారులు తెలిపారు. శిథిలాలు మొత్తం తొలగిస్తే మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. టర్కీ, సిరియాకు ఇతర దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలతో సాయం అందిస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే భారత్ వైద్య, రెస్క్యూ బృందాలను పంపింది. మరోవైపు సిరియాకు రష్యా సాయం చేస్తోంది. ఆ దేశానికి చెందిన 300 మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.