Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్‌కు పొత్తులు అవసరం లేదని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓడించేది కాంగ్రెస్ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో పొత్తు గురించి ఎవరు మాట్లాడినా.. అది వారి వ్యక్తిగతమన్నారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.