Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. 'వాలెంటైన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. లవర్ వెంట పడుతూ హీరో పాడుకునే పాట ఇది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. మురళీశర్మ .. శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో కిరణ్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.