Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అపార్ట్మెంట్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి టౌన్ కు చెందిన మోతె రేణుక (19) మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లోని లా గార్డియన్ అపార్ట్మెంట్ లో నివాసముంటు గోకరాజు రంగరాజు కాలేజ్ లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కొద్దిరోజులుగా ఆరోగ్య పరిస్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న రేణుక మంగళవారం తాను ఉంటున్న అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలిసులు వివరాల సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్మాప్తు చేస్తున్నట్లు తెలిపారు.