Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫొటో క్వాలిటీ ఫీచర్‌ను ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ప్రవేశపెట్టింది. న్యూ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు పంపడం లేదా డేటాను సేవ్ చేసుకునేందుకు కంప్రెస్డ్ ఫార్మాట్లో ఫొటోలను పంపే వెసులుబాటు కలిగింది. వాట్సాప్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా యూజర్లు ఫొటో క్వాలిటీ ఫీచర్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులో లేదు. రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. వెబ్ యూజర్లకు కూడా ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు సాగిస్తోంది. ఇక క్వాలిటీ ఫొటోలను ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా పంపాలంటే..వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. స్టోరేజ్, డేటాపై ట్యాప్ చేసి కింద ఇచ్చే ఆప్షన్స్ నుంచి మీడియా అప్లోడ్ క్వాలిటీని ట్యాప్ చేయాలి. ఇక్కడ ఆటో, బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్ (డేటా సేవ్ చేసేందుకు కంప్రెస్డ్ ఫొటో పంపేందుకు) ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి. అయితే సెట్టింగ్స్‌లో మార్పుల ద్వారా మీరు మీ ఫోటో అప్లోడ్ ప్రాధాన్యతను మార్చుకోవచ్చు.