Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ పై ఏపీ మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించడం తెలిసిందే. తనను లోకేశ్ జబర్దస్త్ ఆంటీ అని పిలిచినందుకు బదులుగా, లోకేశ్ ను అంకుల్ అని పిలుస్తానని రోజా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మంత్రి రోజాపై నిప్పులు చెరిగారు. రోజా నోరు అదుపులో పెట్టుకోకుంటే, ఏదో ఒకరోజు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ల చేతిలో చావుదెబ్బలు తినడం ఖాయం అని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే నేరాలు, ఘోరాలన్నింటికీ ఐరన్ లెగ్ రోజా, మహా ఐరన్ లెగ్ జగనే కారణమని వ్యాఖ్యానించారు.