Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జావేద్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సహానటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా జావేద్ ఖాన్ హిందీలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ లాగాన్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ఇండియా, చక్‌దే ఇండియా, సడక్ 2, అందాజ్ అప్పా అప్పా, ఇష్క్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక లాగాన్, వన్స్ అపాన్ టైం ఇన్ ఇండియా చిత్రాలకు అయన అవార్డు కూడా అందుకున్నారు. 2001లో లగాన్ చిత్రానికి గానూ ఆయన అకాడమి అవార్డుకు నామినేట్ అవ్వడం విశేషం.